Rohit sharma: సూర్యకుమార్‌ ఫామ్‌పై రోహిత్‌ ఫన్నీ కామెంట్‌!

టమ్‌ఇండియా యువ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరదా వ్యాఖ్యలు చేశాడు. 

Published : 05 Oct 2022 11:52 IST

దిల్లీ: టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడిగా స్థానం సంపాందించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్లతో సఫారీలపై విరుచుకుపడ్డాడు. అంతకుముందు హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ యువ ఆటగాడు రాణించాడు. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరదా వ్యాఖ్యలు చేశాడు. 

ప్రపంచకప్‌ టోర్నీ ముందు జట్టును ఆందోళన పరుస్తున్న అతిపెద్ద అంశం ఏమిటని విలేకరులు రోహిత్‌ను అడగ్గా.. ఇందుకు సరదాగా స్పందించాడు. ‘‘ఒక్కటని చెప్పలేం.. మేం దృష్టి సారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందులో సూర్యకుమార్‌ ఫామ్‌ కూడా ఒకటి’’ అంటూ నవ్వుతూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ సైతం ఓ ప్రశ్నకు ఇదే తరహాలో సమాధానం ఇచ్చాడు. ‘దినేశ్‌ కార్తిక్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే.. నంబర్‌ 4 స్థానానికి ఎసరొచ్చేలా ఉంది’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో దినేశ్‌ (46) ఒక్కడే రాణించిన నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ విధంగా స్పందించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ అనంతరం జరిగిన విలేకరుల సమావేశం ఈ సరదా సంభాషణలకు వేదికైంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని