IND vs AFG: కాస్త కష్టంగానే ఉన్నా మాకిది అలవాటే: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8లో భాగంగా జూన్‌ 20న భారత్, అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) తలపడనున్నాయి. ఈ సందర్భంగా జట్టు సన్నద్ధతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. 

Published : 19 Jun 2024 18:35 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8లో భాగంగా జూన్‌ 20న భారత్, అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) తలపడనున్నాయి. మొన్నటివరకు  న్యూయార్క్‌లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా సూపర్‌-8 మ్యాచ్‌లను విండీస్‌లో ఆడనుంది. భారత్‌, అఫ్గాన్‌ మ్యాచ్‌కు బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్‌ ఓవల్‌ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సందర్భంగా జట్టు సన్నద్ధతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. 

‘‘జట్టులో ఉన్న వారందరూ ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉత్సుకతతో ఉన్నారు. మేం మా స్కిల్‌ సెషన్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటాం. ప్రతి స్కిల్ సెషన్‌లో సాధించడానికి ఏదో ఒకటి ఉంటుంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌ ముగియగానే 3-4 రోజుల వ్యవధిలోనే మరో రెండు మ్యాచ్‌లు ఆడబోతున్నాం. విరామం లేని షెడ్యూల్‌తో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ఇవన్నీ మాకు అలవాటే.  ప్రయాణాలు చేసి మరీ ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. ప్రస్తుతం మా ఫోకస్ అంతా జట్టుగా ఏం చేయాలనే దానిపైనే ఉంది. ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏంటో తెలుసు. అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని