Published : 28 May 2022 02:45 IST

French Open: ‘అలా చేసినందుకు క్షమాపణలు కోరుతున్నా..’

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రొమేనియా క్రీడాకారిణి ఇరినా కెమెలియా బేగు తన రాకెట్‌ను టెన్నిస్‌ కోర్టులో నేలపై బలంగా కొట్టింది. దీంతో ఆ రాకెట్ దగ్గర్లో ఉన్న ప్రేక్షకుల్లోకి ఎగిరిపడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ముఖానికి గాయమైంది. కోర్ట్ 12లో ఎకటెరినా అలెగ్జాండ్రోవాతో గురువారం జరిగిన రెండో సెట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇరినా-కామెలియా బేగు మాట్లాడారు. రాకెట్‌ని ప్రేక్షకులపై విసిరినందుకు క్షమాపణలు కోరింది. ‘ఇది నాకు ఇబ్బందికరమైన క్షణం. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నా కెరీర్‌లో ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించండి’ అని ఇరినా పేర్కొంది. గాయపడిన చిన్నారితో మ్యాచ్‌ అనంతరం ఇరినా కెమెలియా బేగు ఫొటోలకు ఫోజులిచ్చింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని