లైయన్‌ పట్ల అసూయగా ఉంది: టేలర్‌ 

ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ పట్ల అసూయగా ఉందని న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌ అన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గబ్బా వేదికగా...

Published : 21 Jun 2021 01:17 IST

టీమ్‌ఇండియా సంతకాలు చేసివ్వడంపై..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ పట్ల అసూయగా ఉందని న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌ అన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌ ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌కు వందో టెస్టు కావడం విశేషం. అప్పుడు అజింక్య రహానె నేతృత్వంలోని భారత జట్టు ఒక జెర్సీపై సంతకాలు చేసి జ్ఞాపకంగా లైయన్‌కు అందజేశారు. ఆ విషయాన్ని అప్పుడే అతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

కాగా, గతేడాది ఫిబ్రవరిలో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా వెల్లింగ్టన్‌లో ఆడిన తొలి టెస్టు కూడా ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌కు వందోది. అయితే అప్పుడతడికి టీమ్‌ఇండియా.. లైయన్‌కు ఇచ్చినట్లు సంతకాలు చేసిన జెర్సీ ఇవ్వలేదని తాజాగా అతడు వెల్లడించాడు. ‘గతేడాది నా వందో టెస్టు టీమ్‌ఇండియాపై ఆడాను. అప్పుడు నాకు ఎలాంటి జెర్సీ రాలేదు. ఈ విషయంలో లైయన్‌ పట్ల అసూయగా ఉంది. అతడు భారత జట్టు నుంచి జెర్సీ అందుకున్నప్పుడు ఫర్వాలేదులే అనుకున్నా’ అని టేలర్‌ ఒక క్రికెట్‌ పోడ్‌కాస్ట్‌లో వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని