RCB : దక్షిణాఫ్రికా బ్యాటర్‌ను వరించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ

ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథి దొరికేశాడు. రెండు వారాల్లో...

Updated : 14 Mar 2022 20:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథి దొరికేశాడు. గత కొన్ని రోజులుగా అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ 15వ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌ను ఎంపిక చేసింది. మెగా వేలంలో భారీ మొత్తం (రూ. 7 కోట్లు) పెట్టి దక్కించుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ఫా డుప్లెసిస్‌కు విరాట్ కోహ్లీ స్థానంలో సారథ్య బాధ్యతలను అప్పగించింది.  ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆర్‌సీబీ ప్రకటించింది. గత సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన డుప్లెసిస్‌ ఐపీఎల్ 14వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఓపెనర్‌గా రాణించి సీఎస్‌కే టైటిల్‌ను నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్కసారైనా కప్‌ను సాధించాలనే ఆర్‌సీబీ కలను డుప్లెసిస్‌ తీరుస్తాడో లేదో వేచి చూడాల్సిందే. 

ఆర్‌సీబీకి డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘బ్యాటన్‌ను ఫా డుప్లెసిస్‌కు అందించడం సంతోషంగా ఉంది. అతడి నాయకత్వంలో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా.. ఇది మా కొత్త కెప్టెన్‌కు నా నుంచి సందేశం’’ అని వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. మార్చి 26 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. మార్చి 27న పంజాబ్‌ కింగ్స్‌తో తమ మొదటి మ్యాచ్‌ని ఆడనుంది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు