MIW vs RCBW: విజృంభించిన ముంబయి బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ
డబ్ల్యూపీఎల్ (WPL)లో ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL) చివరి అంకానికి చేరుకుంది. నేటితో లీగ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ (MIW)తో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW) తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ (29; 38 బంతుల్లో 3 ఫోర్లు) రాణించగా.. రిచా ఘోష్ (29; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. స్మృతి మంధాన (24; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. సోఫీ డివైన్ డకౌట్ కాగా.. హెథర్ నైట్ (12), కనికా అహుజా (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. శ్రేయంకా పాటిల్ (4), మేఘన్ స్కట్ (2), దిశా కాసాట్ (2) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్, ఇస్సీ వాంగ్ రెండేసి వికెట్లు తీశారు. సైకా ఇషాక్ ఒక వికెట్ పడగొట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!
-
Sports News
Team India: డబ్ల్యూటీసీ ఫైనల్.. అప్పటికి ఆటగాళ్లు సిద్ధం: భారత కోచింగ్ సిబ్బంది
-
Movies News
Rana Daggubati: అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నా.. అందుకే నటుణ్ని అయ్యా: రానా
-
India News
Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!
-
India News
Cheetah: చీతాల మృతి.. పూర్తి బాధ్యత మాదే: కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్