RCB vs PBKS: టాస్‌ గెలిచి  బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు మరికాసేపట్లో కీలక పోరులో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది.. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ ఎంతో కీలకం. ఇందులో విజయం సాధిస్తే కోహ్లీసేన ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికే 14 పాయింట్లతో మూడో

Updated : 03 Oct 2021 15:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు మరికాసేపట్లో కీలక పోరులో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ ఎంతో కీలకం. ఇందులో విజయం సాధిస్తే కోహ్లీసేన ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికే 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. పంజాబ్‌ను ఓడిస్తే ఏ అడ్డంకులూ లేకుండా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్తుంది. మరోవైపు పంజాబ్‌ 10 పాయింట్లతో కొనసాగుతుండటంతో టాప్‌-4లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ తప్పక గెలవాలి. ఓడితే ప్లే ఆఫ్స్‌ గల్లంతే.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, శ్రీకర్‌ భరత్, మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌, డానియల్ క్రిస్టియాన్, జార్జ్‌ గార్టన్‌, షాబాబ్‌ అహ్మద్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, చాహల్

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు: కేఎల్ రాహుల్‌, మయాంక్ అగర్వాల్‌, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, షారూక్‌ఖాన్‌, సర్ఫారాజ్‌ ఖాన్‌, హెన్రిక్స్‌, హర్‌ప్రీత్ బ్రర్‌, షమి, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని