Rohit Sharma: రోహిత్‌ శర్మకు విశ్రాంతి అవసరం లేదు: ఆర్పీ సింగ్‌

భారత్‌, సౌతాఫ్రికా మధ్య జూన్‌ 9 నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రాలు విశ్రాంతి

Published : 06 Jun 2022 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌, సౌతాఫ్రికా మధ్య జూన్‌ 9 నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రాలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వారిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. సౌతాఫ్రికా సిరీస్‌కు రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకోవడంపై భారత మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ స్పందించాడు. ఈ సిరీస్‌ కోసం రోహిత్‌ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.    

‘రోహిత్‌ శర్మ ఈ సిరీస్ ఆడాలని అనుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనేది అతని వ్యక్తిగతం. విశ్రాంతి అనేది అతడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ, రోహిత్‌కి విరామం అవసరం ఉందని నేను అనుకోను. అతను ఆడాలి. ఇది సుదీర్ఘమైన సిరీస్. రోహిత్‌ శర్మ కెప్టెన్ కూడా.. ఈ విషయాన్ని మర్చిపోకండి. భారత టీ20 లీగ్‌లో అతడు గత కొన్ని సీజన్లలో 400కి పైగా పరుగులు చేయలేదు. 400 పరుగుల మార్క్‌ను దాటిన వారు చాలా మంది ఉన్నారు. టోర్నమెంట్‌లో అతడు నిలకడగా ఆడలేదు. కానీ, రెండు, మూడు సార్లు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి, రోహిత్‌ శర్మ దూకుడుగా బ్యాటింగ్‌ చేయగలడని అందరూ భావిస్తారు. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్లు కావాలి. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో రాణించిన  జట్టు విజయం సాధిస్తుంది’ అని ఆర్పీ సింగ్ వివరించాడు. 

ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లో రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 268 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో అతడు ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇదిలా ఉండగా, దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్‌ 9న తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని