Tokyo Olympics: నీరజ్‌ చోప్రాకు హరియాణా భారీ నజరానా..!

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన భారతీయ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా(23)కు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

Published : 07 Aug 2021 19:06 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన భారతీయ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా(23)కు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చరిత్ర సృష్టించే ప్రదర్శన చేసినందుకు ప్రశంసిస్తూ ఆయనకు రూ.6 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు  రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ శనివారం ట్వీట్‌ చేశారు. ఈ క్షణాల కోసమే యావత్‌ భారతావని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు. దేశమంతా నీరజ్‌ విజయం పట్ల గర్వంగా ఉందన్నారు. హరియాణా నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన క్రీడాకారులందరికీ రూ.10 లక్షల చొప్పున నగదు  ఇవ్వనున్నట్టు సీఎం శుక్రవారం ప్రకటించారు.

దేశ ప్రజల అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. తుది ప్రదర్శనలో ఈటెను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని