MS Dhoni-Ruturaj: ధోనీపై ఆ ట్రెండ్‌ను తొలిసారి నేనే ప్రారంభించా: రుతురాజ్‌

జట్టు పగ్గాలను ధోనీ నుంచి అందుకొన్న రుతురాజ్‌ ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నైను ప్లేఆఫ్స్‌కు తీసుకొచ్చాడు. ఈక్రమంలో ‘కెప్టెన్‌ కూల్‌’పై సోషల్ మీడియాలో ఓ ట్రెండ్‌ను సృష్టించాడు.

Updated : 11 Jul 2024 15:59 IST

ఇంటర్నెట్ డెస్క్: రుతురాజ్ గైక్వాడ్‌.. ఈ టీమ్‌ఇండియా ఆటగాడు ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. తాజాగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌ పెట్టుకున్న పోస్టు వైరల్‌గా మారింది. దానికి కారణం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై (MS Dhoni) ఓ ట్రెండ్‌ సెట్‌ చేసినట్లు అందులో పేర్కొనడమే. ఇంతకీ ఆ ట్రెండ్‌ ఏంటనేది తెలియాలంటే.. ఇది చదివేయండి.

‘తలా ఫర్ ఏ రీజన్’ (Thala For A Reason) ఇది సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్‌ అయిన కొటేషన్. ఎంఎస్ ధోనీని ఐపీఎల్‌లోని సీఎస్కే అభిమానులు ఆప్యాయంగా ‘తలా’ అని పిలుస్తుంటారని తెలుసు కదా.. ఏ మ్యాచ్‌ గెలిచినా అది ధోనీకే అన్నట్లుగా నెట్టింట వైరల్‌గా మారింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. అప్పుడు కూడా ధోనీ కోసమే అన్నట్లుగా అభిమానులు కామెంట్లు చేశారు. ధోనీ బర్త్‌డే కూడా జులై 7 అని తెలిసిందే. తాజాగా రుతురాజ్‌ (Ruturaj Gaikwad) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ధోనీ నుంచే సీఎస్కే పగ్గాలను రుతురాజ్‌ అందుకొన్నాడు. భారత్‌ తరఫున టీ20ల్లో ఆడుతున్న రుతురాజ్‌ క్యాప్‌ నంబర్ 88. ఆ రెండు అంకెలను కలిపితే 16 వస్తుంది. మళ్లీ ఈ రెండు అంకెలను కలిపితే 7 అవుతుంది. ధోనీ లక్కీ నంబర్ కూడా ఏడే. ‘తలా ఫర్ ఏ రీజన్’ ట్రెండింగ్‌ను చేయడంలో ముందున్నానని క్యాప్షన్ జోడించాడు.

అదరగొట్టేస్తున్న రుతురాజ్‌..

చాన్నాళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికైన రుతురాజ్‌ (Ruturaj Gaikwad) బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో 7 పరుగులకే పరిమితమైనప్పటికీ.. రెండో మ్యాచ్‌లో 77 (47), మూడో టీ20లో 49 (28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొదటి రెండు మ్యాచుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన అతడు.. గత పోరులో మాత్రం సెకండ్‌ డౌన్‌లో వచ్చి దూకుడు కొనసాగించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు