IND vs SL : లంకతో టీ20 సిరీస్‌.. గాయం కారణంగా రుతురాజ్‌ ఔట్..

యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ శ్రీలంకతో టీ20 సిరీస్‌లోని...

Published : 26 Feb 2022 13:58 IST

గైక్వాడ్‌ స్థానంలో మయాంక్‌కు చోటు

ఇంటర్నెట్ డెస్క్‌: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి టీమ్‌ఇండియా ఊపు మీదుంది. ఇవాళ ధర్మశాల వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అయితే గాయం కారణంగా భారత యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ లంకతో మిగతా రెండు టీ20లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ జట్టులోకి వచ్చాడు. రుతురాజ్‌ కుడి చేయి మణికట్టు వద్ద గాయం కావడంతో మిగిలిన టీ20లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. ఇదే కారణంతో మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు కూడా సెలెక్షన్‌కు అందుబాటులో లేడని, ప్రస్తుతం రుతురాజ్‌ను బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి పంపిస్తామని బీసీసీఐ తెలిపింది. 

‘‘లంకతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు మణికట్టు నొప్పిగా ఉందని రుతురాజ్‌ సెలెక్షన్ కమిటీ దృష్టికి తీసుకురాగా.. బీసీసీఐ వైద్య బృందం పరీక్షించింది. ఎంఆర్‌ఐ స్కాన్‌ తర్వాత స్పెషలిస్ట్‌ కన్సెల్టింగ్‌తో సంప్రదింపులు జరిపాం. తదుపరి వైద్య పరీక్షల కోసం ఎన్‌సీఏకు పంపిస్తాం’’ అని బీసీసీఐ పేర్కొంది. దీంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ధర్మశాలలో జట్టుతో మయాంక్‌ చేరతాడు. ఇవాళ లంకతో రెండో టీ20 మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు జరగనుంది. తొలి మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

మిగతా రెండు మ్యాచ్‌లకు టీమ్‌ఇండియా జట్టు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్‌ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్‌ హుడా, రవీంద్ర జడేజా, చాహల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, భువనేశ్వర్‌ కుమార్, హర్షల్‌ పటేల్, బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), అవేశ్‌ ఖాన్‌, మయాంక్ అగర్వాల్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని