Ruturaj gaikwad: మిత్రమా.. స్టువర్ట్‌ బ్రాడ్‌ను గుర్తుచేసుకో: శివసింగ్‌కు రుతురాజ్‌ సూచన

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా తనకు బౌలింగ్‌ వేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఆటగాడు శివసింగ్‌పై రుతురాజ్‌ గైక్వాడ్‌ తాజాగా స్పందించాడు. 

Published : 02 Dec 2022 11:38 IST

దిల్లీ: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్‌- ఎ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌ క్రికెట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ వేదికగా అతడు ఈ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.  అయితే, ఈ మహరాష్ర్ట కెప్టెన్‌కు బంతులు వేసిన యూపీ బౌలర్‌ శివ సింగ్‌ను మాత్రం ఈ మ్యాచ్‌ తీవ్రంగా బాధించింది. దీనిపై తాజాగా రుతురాజ్‌ స్పందించాడు. గెలుపోటములు ఆటలో సహజమేనని ఈ విషయంలో  శివసింగ్‌.. స్టువర్ట్‌ బ్రాడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాడు. 

‘‘అస్సాం బౌలర్లను తక్కువ చేయడం లేదు కానీ, బౌలింగ్‌ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఆటగాళ్లు ఎంతో మెరుగ్గా ఉన్నారు. వారు ఆల్‌రౌండ్‌ అటాక్‌ చేయగలరు. మొదట్లోనే మా రెండు వికెట్లను వారు పడగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇది నా మొదటి మ్యాచ్‌ . నాపై ఉన్న ఒత్తిడి ఆరోజు అలా ఆడేలా చేసింది. నా ప్రదర్శన శివసింగ్‌ను ఎంత నిరాశకు గురిచేసిందో నేను అర్థం చేసుకోగలను. ఈ సందర్భంగా నేను అతడికి స్టువర్ట్‌ బ్రాడ్‌ను గుర్తుచేయాలనుకుంటున్నాను. అతడు ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు సమర్పించాల్సి వచ్చింది. కానీ, ఆ తర్వాత అతడు అద్భుతమైన కెరీర్‌ కొనసాగించాడు. ప్రతి వైఫల్యం మనకు కొత్త విషయాన్ని నేర్పుతుంది’’ అంటూ రుతురాజ్‌ తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన బంతులను యువరాజ్‌ సింగ్‌ వరుస పెట్టి సిక్సర్లుగా మలిచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని