Pujara: ఛెతేశ్వర్‌ పుజారాకు తగిన గుర్తింపు దక్కలేదు: సచిన్ తెందూల్కర్‌

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ (Cheteshwar Pujara)కు తగిన గుర్తింపు లభించలేదని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 10 Feb 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) పై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు అతడు అపారమైన సేవలు అందించాడని, కానీ పుజారా సాధించిన ఘనతలకు తగినంత గుర్తింపు లభించలేదని సచిన్‌ వ్యాఖ్యానించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా ఆడుతున్నాడు. అతడికిది 99వ టెస్టు మ్యాచ్‌. ఈ సిరీస్‌లో అతడు 100వ మ్యాచ్‌ని ఆడనున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఛెతేశ్వర్‌ ఇప్పటివరకు 7,000  పైచిలుకు పరుగులు చేశాడు.  

‘పుజారా సాధించిన ఘనతలకు తగినంతగా గుర్తింపు లభించలేదని, జట్టులో అతడికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని భావిస్తున్నాను.  దేశం కోసం పుజారాఅద్భుతంగా ఆడాడు. భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాల్లో అతడి  సహకారం అపారమైనది’ అని పీటీఐతో సచిన్‌ తెందూల్కర్‌ పేర్కొన్నాడు. 
ఇక, ఆసీస్‌తో తొలి టెస్టు విషయానికొస్తే.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77/1 స్కోరుతో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆసీస్‌ 177 పరుగులకే ఆలౌటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని