మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: సచిన్‌

అమ్మాయిలు, అబ్బాయిల పట్ల అన్ని వేళలా అన్ని విషయాల్లో సమానత్వం చూపాలని, లింగ భేదం ఉండకూడదని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అభిప్రాయపడ్డారు...

Published : 24 Jan 2021 23:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమ్మాయిలు, అబ్బాయిల పట్ల అన్ని వేళలా అన్ని విషయాల్లో సమానత్వం చూపాలని, లింగ భేదం ఉండకూడదని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అభిప్రాయపడ్డారు. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా పేర్కొన్నారు. తన కుమార్తె సారా, కుమారుడు అర్జున్‌ చిన్నప్పుడు విహారయాత్రకు వెళ్లిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. 

‘మన కుమార్తెలు, కుమారుల పట్ల అన్ని వేళలా ఒకే విధమైన ప్రేమ, ఆప్యాయత, అవకాశాలు చూపాలి. మన నుంచే మన పిల్లలు ఏదైనా నేర్చుకుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం సరైన మార్గంలో పయనించి వారికి ఆదర్శంగా నిలవాలి. ఇద్దరినీ ఒకేలా చూసుకోవాలి’ అని సచిన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సచిన్‌ను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ ఎప్పుడూ ఆదర్శంగా ఉంటారని మెచ్చుకున్నారు. నిజంగానే అమ్మాయిల పట్ల వివక్ష చూపొద్దని, వారిని కూడా అబ్బాయిలతో సమానంగా చూడాలని ఆకాంక్షించారు. 

ఇవీ చదవండి..
ఓపిక పడితే టీమ్‌ఇండియా వికెట్లు పడతాయి
మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే.. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని