Sachin Tendulkar: సచిన్‌ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌.. కేరింతలతో దద్దరిల్లిన స్టేడియం..!

సచిన్‌ 49 ఏళ్ల వయస్సులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా ఆడుతుంటే ఇండోర్‌లోని హాల్కర్‌ స్టేడియం దద్దరిల్లిపోయింది. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా సోమవారం ఇండియన్‌ లెజెండ్స్‌ జట్టు న్యూజిలాండ్‌

Updated : 24 Nov 2022 14:25 IST

(ఫొటో : రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: సచిన్‌ 49 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా ఆడుతుంటే ఇండోర్‌లోని హాల్కర్‌ స్టేడియం దద్దరిల్లిపోయింది. ‘రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌’లో భాగంగా సోమవారం ఇండియన్‌ లెజెండ్స్‌ జట్టు న్యూజిలాండ్‌ లెజెండ్స్‌తో తలపడింది. కేవలం 5.5 ఓవర్లు మాత్రమే కొనసాగిన ఈ మ్యాచ్‌.. వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి భారత్‌ స్కోర్‌ 49/1గా ఉంది. సచిన్‌ 146 స్ట్రైక్‌ రేట్‌తో (19*) అజేయంగా క్రీజులో ఉన్నాడు.

మ్యాచ్‌ జరిగిన కొద్దిసేపు సచిన్‌ తనదైన షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. సచిన్‌ ఆటతీరును చూసిన వారు.. అతడు పాతికేళ్ల కుర్రాడిలా అత్యంత కచ్చితత్వంతో షాట్లు ఆడుతున్నాడని కొనియాడారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ మిల్స్‌ తొలి ఓవర్‌ ఐదో బంతికి సచిన్‌ క్రీజులో కొంచెం వెనక్కి జరిగి కొట్టిన ‘బ్యాక్‌ఫుట్‌ పంచ్‌’ షాటుకు బంతి బౌండరీ లైన్‌ దాటిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.  ఆ తర్వాత ల్యాప్‌, పుల్‌, స్కూప్‌ వంటి షాట్లతో న్యూజిలాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. సచిన్‌ ‘బ్యాక్‌ ఫుట్‌ పంచ్‌’ చిత్రాన్ని రోడ్డు సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ కూడా షేర్‌ చేసింది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని