Sachin- Gill : అప్పుడు సచిన్‌.. ఇప్పుడు గిల్‌..

లఖ్‌నవూపై గుజరాత్ అద్భుత విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 63 నాటౌట్: 7 ఫోర్లు) ఓపెనర్‌గా వచ్చి 20 ఓవర్లపాటు క్రీజ్‌లో...

Published : 11 May 2022 09:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లఖ్‌నవూపై గుజరాత్ అద్భుత విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 63 నాటౌట్: 7 ఫోర్లు) ఓపెనర్‌గా వచ్చి 20 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉన్నాడు. ఇలాంటి సంఘటనే 2009 టీ20 లీగ్‌ టోర్నీలోనూ జరిగింది. అయితే అప్పుడు బ్యాటర్‌ టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్. ముంబయి జట్టు తరఫున ఆడిన సచిన్‌ చెన్నైపై ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సరిగ్గా 49 బంతుల్లోనే ఏడు ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. అప్పుడు సచిన్, ఇప్పుడు గిల్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సరూ లేకపోవడం మరో విశేషం. 

2009 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ముంబయి 19 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఇప్పుడు లఖ్‌నవూను 62 పరుగుల తేడాతో గుజరాత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ 82 పరుగులకే కుప్పకూలింది. రషీద్‌ ఖాన్‌ (4/24), సాయి కిశోర్ (2/7) యాష్ దయాల్ (2/24), షమీ  (1/5) విజృంభించారు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో దీపక్‌ హుడా (27) టాప్‌ స్కోరర్‌. హుడాతో సహా డికాక్ (11), అవేశ్‌ ఖాన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న  తొలి జట్టుగా గుజరాత్‌  మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని