Sachin Tendulkar: రూట్‌ నం.315.. బాల్యంలో సచిన్‌ తిరిగిన బస్ ఇదే.!

వైవిధ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్....

Published : 09 Apr 2022 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్: వైవిధ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్. తాజాగా తను బాల్యంలో ప్రయాణించిన రూట్ నం.315 ముంబయి లోకల్ బస్‌లో ఎక్కి బాల్య స్మృతులను నెమరు వేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పంచుకున్నాడు. సచిన్‌ పంచుకున్న ఆ వీడియోను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. తమ అనుభవాలనూ పంచుకుంటున్నారు.

ముంబయిలోని శివాజీ పార్క్‌లో సచిన్‌ తెందూల్కర్‌ క్రికెట్ పాఠాలు నేర్చుకున్న విషయం క్రికెట్ అభిమానులను విధితమే. కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కోచింగ్‌లో సచిన్‌ ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా ఎదిగాడు. అక్కడి నుంచి సచిన్‌ క్రికెట్లో సాధించిన ఘనతల గురించి, టీమ్‌ఇండియాకు అందించిన మరుపురాని విజయాల గురించి మనందరికీ తెలిసిందే.

సచిన్ పోస్ట్‌పై మాజీ క్రికెటర్‌ దిలీప్ జోషీ..‘బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికి మించిన మధురానుభూతి మరోటి లేదు. బాల్య స్మృతులను నెమరు వేసుకుంటే వచ్చే సంతోషానికి మరేది సాటిరాదు’ అని కామెంట్ చేశాడు. ‘చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు.. క్రికెట్ దేవుడు సచిన్‌ తెందూల్కర్‌కి ధన్యవాదాలు’ అని మరో యూజర్ రాసుకొచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని