Sahil: 27 బంతుల్లో సెంచరీ

ఎస్తోనియా ఆటగాడు సాహిల్‌ చౌహాన్‌ (144 నాటౌట్‌; 41 బంతుల్లో 6×4, 18×6) టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సోమవారం ఆతిథ్య సైప్రస్‌తో మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే శతకం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Published : 19 Jun 2024 04:13 IST

గేల్‌ రికార్డును బద్దలుకొట్టిన సాహిల్‌

దిల్లీ: ఎస్తోనియా ఆటగాడు సాహిల్‌ చౌహాన్‌ (144 నాటౌట్‌; 41 బంతుల్లో 6×4, 18×6) టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సోమవారం ఆతిథ్య సైప్రస్‌తో మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే శతకం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో జాన్‌ నికోల్‌ లాఫ్టీ ఈటన్‌ (33 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాహిల్‌దే. 2013 ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్‌ (30) నమోదు చేసిన రికార్డు బద్దలైంది. ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డునూ సాహిల్‌ (18) సొంతం చేసుకున్నాడు. సాహిల్‌ వీర విధ్వంసం సృష్టించడంతో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో పోరులో ఎస్తోనియా ఆరు వికెట్ల తేడాతో సైప్రస్‌ను చిత్తు చేసింది. తొలుత సైప్రస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు రాబట్టింది. ఎస్తోనియా 13 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని