MS Dhoni: ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్‌డే’ బాయ్‌ రియాక్షన్‌ చూశారా..?

మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 07 Jul 2024 14:56 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ అభిమానుల హీరో, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni) 43వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడి భార్య సాక్షి(Sakshi) సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇందులో ధోనీ కేక్‌ కట్‌ చేసి సాక్షికి అందించిన, అనంతరం ఆమె అతడి కాళ్లు నమస్కరించిన వీడియోను పంచుకొన్నారు. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ధోనీ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘‘మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం తలైవా’’ అని పోస్టు పెట్టాడు. 

బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ కూడా ధోనీకి శుభాకాంక్షలు చెప్పారు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా  సల్మాన్‌ ఖాన్‌ అతని కోసం ప్రత్యేకంగా కేక్‌ ఏర్పాటు చేసి కట్‌ చేయించారు. అంతేకాదు ‘‘హ్యాపీ బర్త్‌డే కెప్టెన్‌ సాబ్‌’’ అంటూ ఫొటోను షేర్‌ చేశారు.

ధోనీ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతడి నాయకత్వంలో భారత్‌ 2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.  మైదానంలో ఎంతటి కఠిన పరిస్థితిని అయినా సులభంగా హ్యాండిల్‌ చేసి కెప్టెన్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథిగా ఐదు టైటిళ్లను అందించాడు. తలైవాగా అక్కడి అభిమానుల మనసులో ధోనీ చోటు సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో విశ్రాంతి ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు ముందు సీఎస్కే కెప్టెన్సీని ధోనీ వదులుకొని రుతురాజ్‌కు బాధ్యతలు అప్పగించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని