Gautam Gambhir: ‘అందుకే టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ ప్రకటన ఆలస్యం’

టీమ్‌ఇండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)పేరు దాదాపుగా ఖరారైంది. కానీ, ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఆలస్యమవుతోంది.

Published : 09 Jul 2024 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిసింది. త్వరలోనే కొత్త కోచ్‌ను నియమించనుంది బీసీసీఐ. ఈ నెలాఖరులో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్‌ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. మాజీ ఓపెనర్‌ గౌతమ్‌గంభీర్‌ (Gautam Gambhir)ను త్వరలోనే కోచ్‌గా నియమిస్తారని వార్తలొస్తున్నాయి. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా పూర్తయింది. సహాయక కోచ్‌ల ఎంపిక విషయంలో కూడా బీసీసీఐ గంభీర్‌కు పూర్తిస్వేచ్ఛ ఇచ్చిందట. జీతభత్యాల విషయంలో బీసీసీఐ, గంభీర్‌ల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని సమాచారం. ఈనెల 27 నుంచి శ్రీలంక, భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఆలోపు కొత్త కోచ్‌ ప్రకటన వెలువడే ఛాన్స్‌ ఉంది.  

ద్రవిడ్‌కు యువ క్రికెటర్ల ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్’

బెంగళూరులోని స్థానిక క్రికెట్ అకాడమీలో యువ క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid)కు ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్ విన్నింగ్ కోచ్‌గా ఎంట్రీ ఇస్తున్న యువ క్రికెటర్లు చేతుల్లో పట్టుకొని ఉన్న బ్యాట్లను పైకి ఎత్తి ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ఇచ్చారు. ద్రవిడ్ నవ్వుతూ యువ క్రికెటర్లతో కరచాలనం చేశాడు. భారత్ 2024 టీ20 ప్రపంచకప్ గెలవడంతో ద్రవిడ్ వరల్డ్ కప్‌ కల నెరవేరింది. ఆటగాడిగా ఒక్క ప్రపంచ కప్‌ను సాధించని ద్రవిడ్ టీమ్‌ఇండియా కోచ్‌గా ఆ వెలితిని తీర్చుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని