Virat Kohli-Rohit Sharma: రోహిత్ శర్మకు కోహ్లి సపోర్ట్.. పొగడ్తలతో ముంచెత్తిన పాక్ క్రికెటర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్ శర్మకు.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతు ప్రకటించడం పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంతోషం వ్యక్తం చేశాడు. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లతో కలిసి జట్టు విజయాల కోసం
ఇంటర్నెట్ డెస్క్: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్ శర్మకు.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతు ప్రకటించడం పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంతోషం వ్యక్తం చేశాడు. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి జట్టు విజయాల కోసం నిరంతరం కృషి చేస్తానని విరాట్ ఇటీవల పేర్కొన్నాడు. తనకూ, రోహిత్ శర్మకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా స్పష్టం చేసినట్లు కోహ్లి వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన అంశంపై కోహ్లి వ్యవహరించిన తీరును సల్మాన్‌భట్ మెచ్చుకున్నాడు. జట్టులో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొనసాగలాంటే రోహిత్‌కి విరాట్ మద్దతు తెలపడం ముఖ్యమని పాక్ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు.
ఇద్దరూ మ్యాచ్ విన్నర్లే
‘వన్డే కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లి చాలా తెలివిగా వ్యవహరించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ భారత జట్టుకు మ్యాచ్ విన్నర్లే. హిట్‌మ్యాన్‌కి విరాట్ మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇది జట్టు వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి ఉపకరిస్తుంది’ అని భట్ అన్నాడు. సల్మాన్ భట్ మరో విషయాన్ని కూడా ప్రస్తావించాడు. గత కొన్నేళ్లుగా విదేశాల్లో టీమ్ఇండియా విజయాలు సాధించడానికి గల కారణాలను విశ్లేషించాడు. సవాళ్లను ఎదుర్కోవడానికి భారత జట్టు సిద్దమవుతోందని, భారత్-ఎ జట్లు విదేశాల్లో పర్యటించడం వల్ల అక్కడి పరిస్థితులపై ఆటగాళ్లు ఓ అంచనాకు వస్తున్నారని వివరించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!