Shubman Gill: అతడి ప్రశంసలకు గిల్ పూర్తి అర్హుడు: పాక్ మాజీ కెప్టెన్
శుభ్‌మన్ గిల్‌పై (Shubman Gill) సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) కీలక పాత్ర పోషిస్తాడని అంతా అంచనా వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సచిన్ తెందూల్కర్‌తో (Sachin) శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) పోలుస్తూ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ కూడా గిల్‌ను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో గిల్ వంటి ఆటగాడికి బౌలింగ్ వేస్తే.. వన్డే ఫార్మాట్‌లో సచిన్‌కు బౌలింగ్ చేసినట్లు ఉంటుందని పేర్కొన్నాడు. సచిన్ - గిల్‌పై వసీమ్ అక్రమ్ చేసిన కామెంట్లపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ స్పందించాడు. గతేడాది నుంచి గిల్ అద్భుతమైన ఆటతీరుతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడని తెలిపాడు.
‘‘గిల్‌కు బౌలింగ్ చేస్తే సచిన్‌కు వేసినట్లు భావిస్తానని వసీమ్ అక్రమ్ చెప్పాడు. ప్రతి ఒక్కరికీ తమ అభినందనలను తెలిపే విధానం కాస్త విభిన్నంగా ఉంటుంది. గతంలోనూ దిగ్గజ క్రికెటర్లతో యువ ఆటగాళ్లను పోలుస్తూ ప్రశంసించారు. ఇప్పుడు వసీమ్ అక్రమ్ చేసిన కామెంట్లకు గిల్ పూర్తిగా అర్హుడు. గర్వంగా ఫీల్ అవ్వాల్సిన క్షణాలు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో వసీమ్ ఒకడు. గిల్ బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ప్రస్తుత క్రికెటర్లలో నాణ్యమైన ఆటగాడు గిల్ అని అనడంలో సందేహం లేదు’’ అని సల్మాన్ భట్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న శుభ్‌మన్ గిల్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుధవారం నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు