IPL Auction: శామ్‌ కరన్‌ @ రూ.18.5కోట్లు.. ఐపీఎల్‌ చరిత్రలో రికార్డ్‌..!

ఐపీఎల్‌ చరిత్రలో ఇంగ్లాండ్‌ ఆటగాడు శామ్‌ కరన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన మినీ వేలంలో రూ.18.50కోట్లకు అతడిని పంజాబ్‌ జట్టు దక్కించుకుంది.

Updated : 23 Dec 2022 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరుగుతోన్న ఐపీఎల్‌ మినీ వేలంలో అతడు రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. నేడు జరిగిన వేలంలో కరన్‌ కోసం ముంబయి, పంజాబ్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.18.50 కోట్లకు పంజాబ్‌ అతడిని దక్కించుకుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ పేరిట ఉంది. 2021లో జరిగిన మినీ వేలంలో మోరిస్‌ను రాజస్థాన్‌ జట్టు రూ.16.25కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడా రికార్డును శామ్‌ కరన్‌ బద్దలుకొట్టాడు.

రెండో స్థానంలో గ్రీన్‌..

ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కూడా మోరిస్‌ రికార్డును దాటి ఐపీఎల్‌ వేలం చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి వేలంలో ముంబయి అతడిని రూ.17.50కోట్లకు దక్కించుకుంది.

వీరికీ భారీ ధరే..

తాజా వేలంలో మరికొంతమంది విదేశీ ఆటగాళ్లకు జాక్‌పాట్‌ తగిలింది.

* ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ను చెన్నై రూ.16.25కోట్లతో సొంతం చేసుకుంది.

వెస్టిండీస్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ను లఖ్‌నవూ జట్టు రూ.16కోట్లకు దక్కించుకుంది.

* ఇంగ్లాండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్‌ జట్టు రూ.13.25 కోట్లకు సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని