Sam Curran: విమానంలో మీకు సీటు లేదు.. క్రికెటర్ శామ్ కరన్‌కు చేదు అనుభవం
వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ సిబ్బంది చేసిన పనికి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ (Sam Curran) తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో ట్విటర్ వేదికగా తన ఆవేదనను వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఐపీఎల్ (IPL 2023) మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకొని రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్వాకంతో కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించడానికి శామ్ కరన్ టికెట్ బుక్ చేసుకొన్నాడు. కానీ, ప్రయాణానికి ముందు.. కేటాయించిన సీట్ విరిగిపోయిందనే కారణంతో తనను విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించలేదని ట్వీట్ చేశాడు.
‘‘వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతుండగా .. నాకు కేటాయించిన సీటు విరిగిపోయిందని సిబ్బంది చెప్పారు. అందులో మీరు ప్రయాణించడం కుదరదు అని తెలిపారు. ఇదంతా పిచ్చితనంగా అనిపించింది. ధన్యవాదాలు వర్జిన్ అట్లాంటిక్. ఇలాంటి సంఘటనతో నేను దిగ్భ్రాంతికి గురి కావడంతోపాటు.. తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని కరన్ ట్వీట్ చేశాడు. అయితే శామ్ ఎక్కడికి ప్రయాణిస్తున్నాడో మాత్రం తెలియజేయలేదు.
శామ్ ట్వీట్‌కు వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. ‘‘హాయ్ శామ్. ఇలా జరగడం బాధాకరం. దానికి క్షమాపణలు చెబుతున్నాం. ఒకవేళ మీరు ఆ విషయాన్ని మా హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకొచ్చి ఉంటే.. వారు సంతోషంగా మరో విమానంలో సీటు కేటాయించేవారు. మీ ఫీడ్‌బ్యాక్‌ను మా కస్టమర్ కేర్ టీమ్‌కూ పంపొచ్చు’’ అని రిప్లై ఇచ్చింది. అయితే, కరన్‌కు జరిగిన సంఘటనకు సోషల్ మీడియాలో అభిమానులు మద్దతుగా నిలిచారు. గతంలో మాకూ ఇలాంటి అనుభవం ఎదురైందని, ఆ సంస్థ మేనేజ్‌మెంట్ సరిగా స్పందించడం లేదని కామెంట్లు చేశారు.
గత టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ కప్ గెలవడంలో శామ్ కరన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ మినీ వేలంలో హాట్ కేక్‌లా అమ్ముడైపోయాడు. అతడి కోసం ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ, చెన్నై, రాజస్థాన్, పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి అత్యధికంగా రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకొంది. అప్పటి వరకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (రూ. 16.25 కోట్లు) పేరిట ఉన్న రికార్డును శామ్ అధిగమించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు