Published : 05 Nov 2021 23:47 IST

T20 World Cup: అరే.. అచ్చం బుమ్రాలా బంతి విసిరాడే.. ఐసీసీ వీడియో వైరల్!

ఇంటర్నెట్‌ డెస్క్: ఒక్కో క్రికెటర్‌ది ఒక్కో ప్రత్యేక శైలి.. బ్యాటింగ్‌లో అయితే బ్యాటర్లు కొన్ని మేనరిజమ్స్‌ను ప్రదర్శిస్తుంటారు. మంచి షాట్‌ కొట్టినప్పుడు, హాఫ్‌ సెంచరీ కానీ సెంచరీగానీ సాధించినప్పుడు బ్యాట్‌ను చూపించడంలో స్పెషాలిటీ ఉంటుంది. సాధారణంగా మన రవీంద్ర జడేజా (జడ్డూ)నే తీసుకుంటే.. అర్ధశతకం లేదా శతకం చేసినప్పుడు బ్యాట్‌ను కత్తిలా గిరగిరా తిప్పేస్తాడు. అదేదో అచ్చం కత్తిసాము చేసినట్టే. సెహ్వాగ్‌, సచిన్‌, ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీ.. వీరికీ తమదైన మేనరిజమ్స్‌ ఉన్నాయి. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ సమయంలో వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలానే బౌలింగ్‌లోనూ ఇలా ప్రవర్తించేవారూ లేకపోలేదు. వికెట్‌ తీస్తే వారి ఆనందాన్ని వ్యక్తం చేసే క్రమంలో విచిత్రమైన విన్యాసాలూ చేస్తుంటారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌, ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడే ఇమ్రాన్‌ తాహిర్‌ వికెట్‌ పడగొడితే చాలు.. దాదాపు గ్రౌండ్‌నంతా చుట్టేస్తాడు. విండీస్‌ బౌలర్‌ కాట్రెల్‌ అయితే సెల్యూట్‌ చేస్తుంటాడు. 

ఒకరి బౌలింగ్‌ యాక్షన్‌ను మరొకరు అనుకరించడం ఏదో వీడియోల్లో సరదాగా చేస్తుంటారేమో కానీ.. అంతర్జాతీయ స్థాయిలో దాదాపు ఒకే బౌలింగ్‌ యాక్షన్‌తో ఇద్దరు బౌలర్లు బంతులను విసరడం మీరు ఎప్పుడైనా చూశారా..? అవును.. ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టు చేసిన వీడియోను చూస్తే ఔరా అనకమానరు. మన ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని తెలుసు కదా.. యార్కర్లను సంధించడంలో దిట్ట. తక్కువ రన్నింగ్‌ నిడివితోనే అత్యుత్తమ వేగాన్ని రాబడతాడు. చేతిని ఎక్కువగా వంపు చేయకుండానే బౌలింగ్‌ చేయడం బుమ్రా స్పెషల్‌. మరి ఇలాంటి బౌలింగ్‌ యాక్షన్‌ను మరొక బౌలర్‌.. అదీ టీమ్‌ఇండియాతో జరిగిన మ్యాచ్‌లోనే బౌలింగ్‌ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ నవీనుల్‌ హక్‌ అచ్చం బుమ్రా మాదిరిగా పెద్దగా చేతిని వంపు చేయకుండానే బౌలింగ్‌ చేశాడు. పరిగెత్తడం, చేతిని తిప్పడంలో కాస్త వ్యత్యాసం ఉన్నా.. బౌలింగ్‌ యాక్షన్‌ మాత్రం ఒకేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఐసీసీ షేర్‌ చేసిన వీడియోను మీరూ చూసేయండి..


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని