Published : 04/12/2021 01:26 IST

David Warner: ‘అప్పుడు వార్నర్‌కి అండగా నిలిచింది సన్‌రైజర్సే కదా..మర్చిపోయారా?’

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు తాము రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు ప్రకటించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (రూ.14 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ అబ్దుల్‌ సమద్(రూ.4 కోట్లు), ‌ఉమ్రాన్‌ మాలిక్‌ (రూ.4 కోట్లు) రిటెయిన్‌ చేసుకుంది. అయితే, ఎస్ఆర్‌హెచ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ని ఆ జట్టు రిటెయిన్‌ చేసుకోలేదు. దీంతో ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క సీజన్‌లో రాణించకపోయినంత మాత్రాన ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని మండిపడుతున్నారు. ఈ అంశంపై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందిస్తూ.. సన్‌రైజర్స్ యాజమాన్యానికి మద్దతుగా నిలిచాడు. డేవిడ్ వార్నర్‌ కష్టాల్లో ఉన్నప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాదే అండగా నిలిచిందని ఇర్ఫాన్‌ గుర్తు చేశాడు. ఈ విషయాన్ని మార్చిపోయారా అని ప్రశ్నించాడు. ఈ మేరకు వార్నర్, ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ పేర్లను ప్రస్తావించకుండా ఓ ట్వీట్ చేశాడు. 

"ఒక విదేశీ ఆటగాడి రిటెయిన్‌ గురించి ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్లందరూ ఒకటి  గుర్తు పెట్టుకోవాలి. తన సొంత దేశం అతనిని ఆడకుండా నిషేధించినప్పుడు అదే ఫ్రాంచైజీ ఆ ఆటగాడికి అండగా నిలిచిందని గుర్తుంచుకోవాలి" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. 2018లో  బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్‌ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని