Sanath Jayasuriya: శ్రీలంక కోచ్‌గా జయసూర్య

మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్య శ్రీలంక జట్టుకు తాత్కాలిక చీఫ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. సొంతగడ్డపై భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 09 Jul 2024 02:35 IST

కొలంబో: మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్య శ్రీలంక జట్టుకు తాత్కాలిక చీఫ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. సొంతగడ్డపై భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) ఈ నిర్ణయం తీసుకుంది. శాశ్వత పరిష్కారం దొరికే వరకు కొన్ని నెలలు జయసూర్య కోచ్‌గా వ్యవహరిస్తాడని సోమవారం ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వైఫల్యం నేపథ్యంలో గతవారం క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో జయసూర్యకు బాధ్యతలు అప్పగించారు. ఈనెల 27న ప్రారంభమయ్యే మూడేసి టీ20, వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం శ్రీలంకలో భారత్‌ పర్యటించనుంది. గతంలో చీఫ్‌ సెలెక్టర్‌గా పనిచేసిన జయసూర్య.. ఆగస్టు- సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ వరకు శ్రీలంకకు కోచ్‌గా కొసాగుతాడు.  55 ఏళ్ల జయసూర్య శ్రీలంక తరఫున 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టీ20ల్లో బరిలో దిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని