సూపర్‌ సందీప్‌: బుమ్రాకూ లేదీ ఘనత

బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ ఆరంభ, ఆఖరి ఓవర్లలో హైదరాబాద్‌కు అండగా నిలిచే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. తెలివిగా బంతులేస్తూ వికెట్లు తీస్తాడు. పరుగులను నియంత్రిస్తాడు. గాయ పడటంతో ఈ సీజన్లో కేవలం 4 మ్యాచులే స్వదేశానికి తిరిగివెళ్లిపోయాడు.....

Published : 05 Nov 2020 00:59 IST

ఎక్కువ ఓపెనర్లు, వన్‌డౌన్‌ వికెట్లు తీసిన హైదరాబాద్‌ పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ ఆరంభ, ఆఖరి ఓవర్లలో హైదరాబాద్‌కు అండగా నిలిచే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. తెలివిగా బంతులేస్తూ వికెట్లు తీస్తాడు. పరుగులను నియంత్రిస్తాడు. గాయ పడటంతో ఈ సీజన్లో కేవలం 4 మ్యాచులే  ఆడి స్వదేశానికి తిరిగివెళ్లిపోయాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సందీప్‌ శర్మ జట్టుకు ప్రధాన పేసర్‌గా మారాడు. భువీ లేని లోటు తీరుస్తున్నాడు. బంతిని మరీ వేగంగా విసరకపోయినా పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ విజయాలను అందిస్తున్నాడు. తాజాగా అతడు జహీర్‌ ఖాన్‌ రికార్డును బద్దలుకొట్టేశాడు.

ఐపీఎల్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, సందీప్‌ శర్మ 90 మ్యాచులు ఆడారు. బుమ్రా రన్నప్‌ నుంచి బంతుల వరకు అంతా వైవిధ్యంగా ఉంటుంది. అత్యంత వేగంగా బంతులు విసురుతాడు. అటు పవర్‌ప్లే, మధ్య ఓవర్లు, ఆఖరి ఓవర్లలో వికెట్లు తీస్తాడు. కానీ సందీప్‌కు అలాంటి వైవిధ్యాలేమీ లేవు. మీడియం పేసర్‌. రన్నప్‌ సైతం సాధారణంగానే ఉంటుంది. అయితే పవర్‌ప్లేలో మాత్రం అతడు దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఎక్కువ ఓపెనర్లు, వన్‌డౌన్‌ ఆటగాళ్లను పెవిలియన్‌ పంపించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. 90 మ్యాచుల్లో 24.02 సగటు, 7.75 ఎకానమీతో 108 వికెట్లు తీస్తే.. అందులో 62 వికెట్లు ఓపెనర్లు, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌కే కావడం విశేషం. గతంలో ఇలాంటి రికార్డు జహీర్‌ పేరుతో ఉండేది.

చాలా సింపుల్‌గా బంతులేసే సందీప్‌ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కీర్తించే విరాట్‌ కోహ్లీని 13 మ్యాచుల్లో 7 సార్లు ఔట్‌ చేశాడు. రోహిత్‌ను 14 మ్యాచుల్లో నాలుగు సార్లు, ఇక యూనివర్స్‌ బాస్‌, టీ20 వీరుడు క్రిస్‌గేల్‌నూ 11 ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు పెవిలియన్‌ పంపించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎదురుదాడికి దిగినా సందీప్‌ భయపడడు. షార్జా వేదికగా జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచులో సందీప్‌ వేసిన ఐదో ఓవర్లో డికాక్‌ వరుసగా 4, 6, 6తో విజృంభించాడు. అయితే ఆ తర్వాతి బంతిని స్టంప్స్‌కు దూరంగా విసిరి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో అతడిని పెవిలియన్‌కు పంపించాడు ఈ పేసర్‌.

ఇవీ చదవండి

ప్లేఆఫ్స్‌లో హైదరాబాద్‌ సరికొత్త రికార్డిది

ముంబయితో అంత ‘వీజీ కాదు’ శ్రేయస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని