Australian open: గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ చివరి మ్యాచ్‌లో సానియా మీర్జాకు నిరాశ..

గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా(Sania Mirza)కు నిరాశే ఎదురైంది.

Updated : 27 Jan 2023 10:25 IST

మెల్‌బోర్న్‌: గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా(Sania Mirza)కు నిరాశే ఎదురైంది.  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (Australian open) మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా మీర్జా- రోహన్‌ బోపన్న జోడీ ఓటమి పాలైంది. ఫైనల్‌ మ్యాచ్‌లో 6-7, 2-6 తేడాతో బ్రెజిల్‌ జంట స్టెఫాని-రఫెల్‌లో చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్లయింది.

2009లో మహేష్‌ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో అయిదు (మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండు, మహిళల డబుల్స్‌లో మూడు) గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు