Sania Mirza: ఆమెకు 36.. అతడికి 42 ఏళ్లు.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన సానియా జోడీ

భారత టెన్నిస్‌ తార (Team India) సానియా మీర్జా (Sania Mirza), రోహన్‌ బొపన్న (Rohan Bopanna) జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2023) ఫైనల్‌కు చేరింది.

Updated : 25 Jan 2023 19:41 IST

ఇంటర్నెట్ డెస్క్: చివరి గ్రాండ్‌స్లామ్‌ను ఆడుతోన్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అదగరొట్టేస్తోంది. మిక్స్‌డ్‌ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా ఫైనల్‌కు చేరుకొంది. సెమీస్‌లో మూడో సీడ్‌ ప్లేయర్లు డిసిరే క్రావ్జిక్‌ - నీల్‌ స్కుప్స్కి జోడీపై 7-6 (5), 6-7 (5), 10-6 తేడాతో సానియా - బొపన్న విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వయస్సుతో సంబంధం లేకుండా తమ అనుభవం మొత్తం రంగరించి మరీ గెలుపొందారు. దాదాపు గంట 52 నిమిషాలు జరిగిన పోరాటంలో సానియా - బొపన్న జోడీ పైచేయి సాధించింది. తొలుత చెరొక రౌండ్‌ విజయం సాధించిన తర్వాత కీలకమైన మూడో రౌండ్‌లో సానియా విజృంభించింది. బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో సానియా మీర్జా అలరించింది. 

మేం ఇప్పటికీ అలానే ఆడుతున్నాం.. 

మ్యాచ్‌ విజయం సాధించిన అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ.. ‘‘ఇదొక అద్భుతమైన మ్యాచ్‌. నా చివరి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరులో రోహన్‌తో కలిసి ఆడటం బాగుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు.. నా మిక్స్‌డ్‌ డబుల్‌ పార్టనర్‌ రోహన్‌. ఇప్పుడు నా వయస్సు 36.. అతడికి 42 ఏళ్లు.. అయినా మేం ఇప్పటికీ ఆడుతున్నాం. ఆటగాళ్లుగా మా మధ్య మంచి బంధం ఉంది. మమ్మల్ని మేం నిరూపించుకొనేందుకు మాకు ఇదొక మంచి అవకాశం. ఇప్పటి వరకు మిక్స్‌డ్‌ డబుల్‌ పోటీల్లో బాగానే ఆడుతున్నాం. భారత్‌ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన చాలామంది నాకు మద్దతుగా నిలిచారు’’ అని సానియా వ్యాఖ్యానించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని