విరాట్‌ కోహ్లీని అర్థం చేసుకోవడం కష్టం.. 

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని అర్థం చేసుకోవడం కాస్త కష్టమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా...

Published : 12 Feb 2021 01:35 IST

అందుకే ఇప్పుడు కుల్‌దీప్‌ గురించి మాట్లాడుకుంటున్నారు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని అర్థం చేసుకోవడం కాస్త కష్టమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో అతడి కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా సంస్థతో మాట్లాడిన ఆయన తొలి టెస్టులో జట్టు ఎంపిక, టీమ్‌ఇండియా వ్యూహాలు సరైనవేనని చెప్పాడు. అయితే, ఆన్‌ఫీల్డ్‌లో బౌలింగ్‌ విషయంలో కోహ్లీ తీసుకున్న కొన్ని నిర్ణయాలే సరిగ్గాలేవని  అభిప్రాయపడ్డాడు.

‘టీమ్‌ఇండియా వ్యూహాల్లో తప్పులు ఉన్నాయని నేను చెప్పను. జట్టు ఎంపిక కూడా సరైనదేనని భావిస్తున్నా. అయితే, ఈ మ్యాచ్‌లో షాబాజ్‌ నదీమ్‌ సరిగ్గా బౌలింగ్‌ చేయకపోయేసరికి అంతా కుల్‌దీప్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ పిచ్‌ అతడికి కొట్టిన పిండి. కాకపోతే వాషింగ్టన్‌ సుందర్‌ సరైన లైన్‌లో బౌలింగ్‌ చేసి ఆకట్టుకోలేదు. ఆఫ్‌స్టంప్‌ అవతల బంతులేయడంలో అతడు మేటి బౌలర్‌. అలా బౌలింగ్‌ చేసిన సందర్భంలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. అయితే, ఇక్కడే విరాట్‌ కోహ్లీని అర్థం చేసుకోవడం కాస్త కష్టం’ అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. 

ఇవీ చదవండి..
బంతి నాణ్యతను పరిశీలించండి.. 
అదే జరిగితే.. కోహ్లీ తప్పుకుంటాడేమో..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని