Team India : భారత టీ20 జట్టులో ఆ సీనియర్‌ బౌలర్‌ కీలకం: సంజయ్‌ మంజ్రేకర్‌

మరో ఎనిమిది రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే పొట్టి ప్రపంచకప్‌ వచ్చేయనుంది. ఇప్పటికే టీమ్ఇండియా అన్ని అస్త్రాలను...

Published : 20 Aug 2022 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో ఎనిమిది రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే పొట్టి ప్రపంచకప్‌ వచ్చేయనుంది. ఇప్పటికే టీమ్ఇండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌ జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే సీనియర్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగనుంది. గాయం కారణంగా బుమ్రాతోపాటు హర్షల్‌ దూరమయ్యారు. అయితే మరో సీనియర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నేతృత్వంలోని బౌలింగ్‌ దళం ఆసియా కప్‌లో ప్రత్యర్థులను ఢీకొట్టనుంది. అర్ష్‌దీప్‌, అవేశ్‌ ఖాన్‌, హార్దిక్‌, భువీతో ఫాస్ట్‌ బౌలింగ్‌.. అలానే యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌, అశ్విన్‌, జడేజాతో కూడిన స్పిన్‌ విభాగం పటిష్ఠంగానే ఉందనిపిస్తుంది. అయితే.. వీరిలో భువనేశ్వర్‌ కుమార్‌ కీలకంగా మారే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. అలానే దీపక్ చాహర్‌ను తీసుకోవడం కూడా మంచి ఎంపికగా పేర్కొన్నాడు.

‘‘దీపక్‌ చాహర్‌ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. అతడిని పరీక్షించేందుకు జింబాబ్వేతో వన్డేలకు ఎంపిక చేయడం బాగుంది. అలానే టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌ జట్టులోకి స్టాండ్‌బైగా తీసుకున్నారు. ఫామ్‌లోకి వచ్చి మంచి ప్రదర్శన ఇస్తే తప్పకుండా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక పోతే సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తనదైన రోజున కఠిన పరిస్థితుల్లోనూ అద్భుతంగా వికెట్లు తీయగలడు. ప్రారంభంలో బంతిని వికెట్‌కు రెండువైపులా స్వింగ్ చేస్తాడు. కానీ డెత్‌ ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నప్పటికీ.. టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళానికి అతడే పెద్ద ఆస్తి. భువీతోపాటు దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌ దాడిని ప్రారంభిస్తే అడ్డుకోవడం ప్రత్యర్థులకు కష్టమే అవుతుంది. ఇద్దరూ ఒకేలాంటి సీమ్‌ బౌలర్లు. స్వింగ్‌ రాబట్టే సత్తా ఉంది’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని