IPL: మంజ్రేకర్‌కు చుక్కెదురు?

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌కు చుక్కెదురైంది! ఐపీఎల్‌-2020 వ్యాఖ్యాతల బృందంలో అతడికి చోటు దక్కలేదని సమాచారం. ఈమెయిల్‌ ద్వారా మొర పెట్టుకున్న అతడిని బీసీసీఐ కనికరించలేదని తెలిసింది. సునిల్‌ గావస్కర్‌, శివ రామకృష్ణన్‌, మురళీ కార్తీక్‌, దీప్‌దాస్ ‌గుప్తా..

Published : 05 Sep 2020 01:47 IST

వ్యాఖ్యాతల బృందంలో దక్కని చోటు

(Getty Image)

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌కు చుక్కెదురైంది! ఐపీఎల్‌-2020 వ్యాఖ్యాతల బృందంలో అతడికి చోటు దక్కలేదని సమాచారం. ఈమెయిల్‌ ద్వారా మొర పెట్టుకున్న అతడిని బీసీసీఐ కనికరించలేదని తెలిసింది. సునిల్‌ గావస్కర్‌, శివ రామకృష్ణన్‌, మురళీ కార్తీక్‌, దీప్‌దాస్ ‌గుప్తా, రోహన్‌ గావస్కర్‌, హర్ష భోగ్లే, అంజుమ్‌ చోప్రాతో కామెంటరీ ప్యానెల్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మంజ్రేకర్‌కు అద్భుతమైన క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్నప్పటికీ మాటతీరు దూకుడుగా ఉండేది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆటగాళ్లు, సహచర వ్యాఖ్యాతలను దిగజారుస్తూ అతడు మాట్లాడాడు. క్రికెటర్లకు మర్యాద ఇవ్వాలని, మీలా మాట్లాడేవారిని చూడలేదని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తీవ్రంగా విమర్శించాడు. హర్షభోగ్లేను అవమానిస్తూ మాట్లాడినప్పుడూ సామాజిక మాధ్యమాల్లో మంజ్రేకర్‌పై విమర్శలు వచ్చాయి. దాంతో బీసీసీఐ అతడిపై వేటు వేసింది.

ఐపీఎల్‌-2020 యూఏఈలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దాస్‌గుప్తా, కార్తీక్‌ అబుదాబి, మిగిలిన వారు షార్జా, దుబాయ్‌లో ఉంటారని తెలిసింది. అబుదాబి, దుబాయ్‌లో తలో 21, షార్జాలో 14 మ్యాచులు జరగనున్నాయి. కామెంటేటర్లు మూడు బృందాలుగా విడిపోయి రెండు బయోబుడగల్లో ఉంటారని వినికిడి. వాస్తవంగా కార్తీక్‌, దాస్‌గుప్తా శుక్రవారమే అబుదాబికి బయల్దేరాల్సి ఉంది. అక్కడ క్వారంటైన్‌ నిబంధనలను 14 నుంచి 7 రోజులకు సడలించడంతో సెప్టెంబర్‌ 10న వెళ్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని