Sanju samson: మా దేశం తరఫున ఆడు.. సంజూ శాంసన్‌కు ఐర్లాండ్‌ ఆఫర్‌!

యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు ఐర్లాండ్‌ బోర్డు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని మ్యాచుల్లో ఆడిస్తాన్న ఒప్పందంపై అతడిని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఐర్లాండ్‌ ఆఫర్‌ను సంజూ తిరస్కించినట్లు తెలుస్తోంది.

Published : 12 Dec 2022 01:13 IST

ముంబయి: టీమ్‌ఇండియా(Team India)లో సుస్థిర స్థానం కోసం చాలా రోజులుగా పోరాడుతున్న యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌(Sanju Samson)కు ఐర్లాండ్ (Ireland) క్రికెట్‌ బోర్డు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ దేశం తరఫున ఆడాలని అతడిని సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను సంజూ శాంసన్‌ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవల భారత సెలక్షన్‌ కమిటీ జట్టులోకి ఎంపిక చేయకుండా శాంసన్‌ను విస్మరిస్తూ వస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 2015లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ కేరళ కుర్రాడు.. ఇప్పటివరకు 27 మ్యాచుల్లోనే ఆడాడు. అది కూడా 2022లో ఆడినవే ఎక్కువ.

ఇటీవల జరిగిన ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌, తాజాగా బంగ్లాదేశ్‌ టూర్‌కు కూడా సంజూ శాంసన్‌ను బీసీసీఐ పక్కన పెట్టింది. కొన్ని మ్యాచ్‌ల్లో తప్ప మిగతావాటిలో అతడి ఆటతీరు కూడా అంత అభ్యంతరకరంగా లేకపోవడంతో సెలక్టర్ల దృష్టిలో అతడు ఎందుకు పడటం లేదంటూ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని మ్యాచుల్లో అవకాశం కల్పిస్తామన్న నిబంధనతో ఐర్లాండ్‌ జట్టు.. తమ తరఫున ఆడాలని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే తాను భారత్‌ తరఫునే ఆడతానని, అవకాశం ఇచ్చినంత వరకు వేచి చూస్తానని సంజూ సమాధానం చెప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని