Sanju Samson: సంజూ.. ట్వీట్‌కి అర్థమేంటో.?
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం తుదిజట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో ఇటీవల ఐపీఎల్లో మెరుగ్గా రాణించిన కోల్‌కతా నైట్..
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో న్యూజిలాండ్ జట్టుతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం తుదిజట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్లో మెరుగ్గా రాణించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న బౌలర్ హర్షల్ పటేల్, దిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి అవేశ్ ఖాన్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ.. బ్యాట్‌తోనూ రాణిస్తున్న సంజూ శాంసన్‌ని మాత్రం సెలెక్టర్లు పక్కన పెట్టారు. దీంతో నిరాశ చెందిన సంజూ.. సెలెక్షన్ కమిటీ ఎంపికను ప్రశ్నిస్తున్నట్లుగా ఓ ఫొటోను ట్వీట్ చేశాడు. అందులో అతడు బౌండరీ లైన్ వద్ద కష్టతరమైన క్యాచ్‌లను ఒడిసిపడుతున్న దృశ్యాలున్నాయి.
ఇదిలా ఉండగా, సంజూ శాంసన్ ఫిట్నెస్ పట్ల సెలెక్టర్లు సంతృప్తికరంగా లేరని.. అందుకే అతడికి తుది జట్టులో చోటు కల్పించలేదని వార్తలొస్తున్నాయి. అయితే, ఐపీఎల్ 2021 సీజన్లో సంజూ 5 ఇన్నింగ్స్‌ల్లో 87.50 సగటుతో 175 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలున్నాయి. ప్రస్తుతం అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టిదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే