WTC Final: కెన్నింగ్టన్‌ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్‌ బ్రాడ్‌మన్‌ సరసన శార్దూల్‌

శార్దూల్ ఠాకూర్‌కు (Shardul Thakur) ఓవల్‌ మైదానం కలిసొచ్చినట్లుంది. వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Published : 10 Jun 2023 01:38 IST

లండన్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌ మ్యాచ్‌లో శార్దూల్ (51) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇలా కెన్నింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికపై వరుసగా మూడో అర్ధశతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌తోపాటు అలెన్‌ బోర్డర్ రికార్డును శార్దూల్‌ సమం చేశాడు. 

ఆసీస్‌పై 109 బంతుల్లో 51 పరుగులు చేసిన శార్దూల్‌కు ఓవల్‌ మైదానంలో మూడో హాఫ్‌ సెంచరీ. గతంలో 2021లో ఇంగ్లాండ్‌పై రెండు సార్లు, ఇప్పుడు ఆసీస్‌పై అర్ధశతకం సాధించాడు. డాన్‌ బ్రాడ్‌మన్‌ (1930-1934), అలెన్‌ బోర్డర్‌ (1985-1989) మూడేసి హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై రాణించడంతో  శార్దూల్‌పై నెట్టింట్‌ ప్రశంసలు కురుస్తున్నాయి. 

  • రెండేళ్ల కిందట (2021) ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో భారత్‌ 117/6 స్కోరుతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన శార్దూల్‌ కేవలం 36 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. 
  • అదే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అతడు క్రీజ్‌లోకి వచ్చేసమయానికి భారత్ స్కోరు 312/6. ఆ ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్‌ 72 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని