Tokyo Olympics: ఇంకొక్క పంచ్‌ విసిరితే పతకమే! క్వార్టర్స్‌కు చేరుకున్న సతీశ్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు పతకాలపై ఆశలు రేపుతున్నారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. 91+కిలోల విభాగంలో సతీశ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించాడు...

Updated : 29 Jul 2021 10:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు పతకాలపై ఆశలు రేపుతున్నారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. 91+కిలోల విభాగంలో సతీశ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించాడు. సతీశ్‌కు ఇది అరంగేట్రం ఒలింపిక్సే కావడం గమనార్హం. రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యాలు గెలిచిన అతడు 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించాడు.

ఐదుగురు న్యాయనిర్ణేతల్లో నలుగురు సతీశ్‌ వైపే మొగ్గుచూపించారు. 30-27, 30-27, 28-29, 30-27, 30-26 స్కోర్లు ఇచ్చారు. ప్రత్యర్థి పాదాల కదలిక చురుగ్గా లేకపోవడాన్ని గమనించిన సతీశ్‌ అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అయినప్పటికీ సతీశ్‌ ముఖానికి చిన్న గాటు పడింది.  క్వార్టర్‌ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ బాఖోదిర్‌ జలోలొవ్‌తో అతడు తలపడనున్నాడు. జలోలొవ్‌ ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌ కావడం గమనార్హం. అతడిని ఓడించి సెమీస్‌కు చేరితే సతీశ్‌కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని