IND vs SA : దక్షిణాఫ్రికా స్పిన్నర్లే నిలకడగా బౌలింగ్‌ చేశారు: పంత్

టీమ్‌ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా...

Published : 22 Jan 2022 15:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా బంతులు విసిరారని రిషభ్ పంత్‌ అన్నాడు. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో అర్ధశతకం (85) చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 287/6 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం పంత్ మాట్లాడుతూ.. సఫారీల బౌలర్లు షంసి, కేశవ్ మహరాజ్‌, మార్‌క్రమ్‌ చాలా చక్కగా బౌలింగ్‌ చేశారని అభినందించాడు. 

‘‘పిచ్‌ చాలా నెమ్మదిగా ఉంది. అయితే భారత్‌ చేసిన పరుగులు సరిపోతాయని భావించా. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడి విజయం సాధించారు. తొలి మ్యాచ్‌లో మేం ఛేదనకు దిగాం. మొదట వారు బ్యాటింగ్‌ చేసేటప్పుడు పిచ్‌ అనుకూలించింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ స్లో అయిపోయింది. దీంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. ఇక నిన్నటి వన్డేలో మధ్య ఓవర్లలో వారు చాలా బాగా ఆడారు. మేం వికెట్లను పడగొట్టడంలో విఫలమయ్యాం’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్‌ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..  ‘‘దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బాగా ఆడారు. భాగస్వామ్యాలు, మిడిలార్డర్‌ వైఫల్యం, మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వంటి కొన్ని తప్పులు చేశాం. అయితే నేర్చుకునేందుకు ఇదొక అవకాశం’’ అని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని