IPL:త్వరలో దుబాయ్‌లో కలుద్దాం:సురేశ్ రైనా

బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటంతో ఐపీఎల్‌-14 అర్ధంతరంగా నిలిచిపోయింది. దీంతో ఈ టోర్నీలో నిర్వహించాల్సి మిగతా 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్య ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముంది.

Published : 31 May 2021 01:08 IST

(photo:Suresh Raina Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌:బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటంతో ఐపీఎల్‌-14 అర్ధంతరంగా నిలిచిపోయింది. దీంతో ఈ టోర్నీలో నిర్వహించాల్సిన మిగతా 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్య ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముంది.

అయితే, యూఏఈలో జరిగే మిగతా మ్యాచ్‌లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు దూరమవనున్నారు. పాకిస్థాన్‌తో సిరీస్‌ వల్ల తమ ఆటగాళ్లను పంపే అవకాశం లేదని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ, భారత ఆటగాళ్ల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కాగా, యూఏఈలో జరిగే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే విషయంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక ఆటగాడు సురేశ్ రైనా స్పష్టతనిచ్చాడు. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను సురేశ్‌ రైనా ట్వీట్‌ చేస్తూ‘త్వరలో దుబాయ్‌లో కలుద్దాం.ఎం.ఎస్‌ ధోనీ, ఐపీఎల్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. అయితే,2020లో యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్‌ 13 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో రైనా దూరమైన సంగతి తెలిసిందే. ఇక, ఐపీఎల్ -14 వాయిదా పడిన నాటికి ఏడు మ్యాచ్‌లాడిన సీఎస్కే..ఐదు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

 

 

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని