Novak Djokovic : ‘‘ఫ్రీ నొవాక్’’... జకోవిచ్‌కు సెర్బియన్లమద్దతు

టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ నొవాక్‌ జకోవిచ్‌కు మద్దతు తెలిపేందుకు...

Published : 07 Jan 2022 20:22 IST

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ నొవాక్‌ జకోవిచ్‌కు మద్దతు తెలిపేందుకు అతడు ఉన్న హోటల్‌ ఎదుట దాదాపు 50 మంది గుమిగూడారు. ‘‘ఫ్రీ నొవాక్’’,  ‘ఫ్రీ రిఫ్యూజీస్‌’’ అంటూ నినాదాలు చేశారు. వ్యాక్సినేషన్‌ తీసుకోకపోవడానికి గల కారణాలు సరిగ్గా లేవని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు వచ్చిన జకోవిచ్‌ను బోర్డర్‌ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. జకోవిచ్‌ వీసాను కూడా రద్దు చేశారు. ఈ క్రమంలో తన వీసాను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వంపై పోరాటానికి జకో సిద్ధమయ్యాడు. ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించగా.. సోమవారం విచారణ చేపట్టనుంది. ఆలోగా జకోవిచ్‌ హోటల్‌ గదికే పరిమితం కానున్నాడు. 

దీంతో జకోవిచ్‌కు మద్దతుగా సెర్బియా జెండాలతో హోటల్‌ వద్దకు చేరుకున్నారు. ఆ దేశ జాతీయ గీతాలను ఆలపించారు. మరికొంతమంది సెర్బియన్లు అక్కడే  సాంప్రదాయమైన క్రిస్మస్‌ డేను జరుపుకున్నారు. ‘‘అతడు (జకోవిచ్‌) మా బిడ్డ. మా దేశానికి మద్దతు తెలుపుతాం. కనీసం క్రిస్మస్‌ కూడా చేసుకోనీయకుండా నిర్బంధించారు. మానవహక్కులు గాలిలో కలిసిపోతున్నాయి’’ అని మద్దతుదారులు వ్యాఖ్యానించారు. జకోవిచ్‌ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నెల 17 నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పోటీలు ప్రారంభమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని