Serena William: టెన్నిస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా: సెరీనా విలియమ్స్

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి, అమెరికా టాప్‌ ప్లేయర్‌ సెరీనా విలియమ్స్‌ ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈమేరకు ఆమె తాజాగా ఓ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు రాసిన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు...

Published : 10 Aug 2022 00:07 IST

న్యూయార్క్‌: ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి, అమెరికా టాప్‌ ప్లేయర్‌ సెరీనా విలియమ్స్‌ ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు రాసిన ప్రత్యేక కథనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.  సెరీనాకు రిటైర్మెంట్‌ అనే పదం ఇష్టంలేని కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తను మరిన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు చెప్పింది. ‘ఈ నెలలో నా వయస్సు 41 ఏళ్లకు చేరుతుంది. దీంతో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా’ అని సెరీనా రాసుకొచ్చింది. మరోవైపు సెరీనా ఈ వారం టొరంటో హార్డ్‌కోర్ట్‌ టోర్నమెంట్‌లో పాల్గొననుంది. అక్కడ రాణిస్తే ఆగస్టు 29 నుంచి జరగబోయే యూఎస్‌ ఓపెన్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో మరో టైటిల్‌ సాధించి మొత్తం 24 గ్రాండ్‌స్లామ్‌లతో అగ్రగామిగా నిలవాలని చూస్తోంది. ఇక ఇప్పటివరకు సెరీనా మొత్తం 23 టైటిళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఆమె కన్నా ముందు మార్గరెట్‌ కోర్ట్‌ 24 టైటిళ్లతో ముందుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని