Updated : 29 Jun 2022 13:51 IST

Wimbledon 2022 : వింబుల్డన్‌లో యువ ప్లేయర్‌ సంచలనం.. అమెరికా దిగ్గజం ఇంటిముఖం

ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికా టాప్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు వింబుల్డన్‌ తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ హార్మోనీ టాన్‌ చేతిలో 7-5, 1-6, 7-6 (10/7) తేడాతో ఓటమి పాలైంది. ఏడుసార్లు ఛాంపియన్‌ అయిన సెరెనా గతేడాది కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. గాయం కారణంగా వైదొలిగింది. అప్పటి నుంచి గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యల నుంచి కోలుకొని డైరెక్ట్‌గా మళ్లీ వింబుల్డన్‌లోనే అడుగు పెట్టింది.

అయితే సెరెనా ఈ వింబుల్డన్‌లో ఆఖరి వరకు విజయం కోసం పోరాడింది. తొలి గేమ్‌లోనే వెనుకబడినా బలంగా పుంజుకుంది. యువ క్రీడాకారిణి హర్మోనీ అతి కష్టం మీద తొలి గేమ్‌ను (7-5) సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో 23 సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత అయిన సెరెనా ఏకపక్షంగా దాడి చేయడంతో (6-1) ప్రత్యర్థి తలవంచక తప్పలేదు. ఇక కీలకమైన ఆఖరి గేమ్‌లో సెరెనా తొలుత ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ టాన్‌ సమర్థవంతంగా ఎదుర్కొంది. చివరికి 7-5 (10/7) తేడాతో టాన్‌ విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ‘‘సెరెనా సూపర్‌ స్టార్‌. చిన్నప్పటి నుంచి ఆమె మ్యాచ్‌లను చూస్తూ పెరిగా. ఇప్పుడు ఆమెపై గెలవడాన్ని మాటల్లో వర్ణించలేను. వింబుల్డన్‌ డ్రా చూసిప్పుడు చాలా భయపడ్డా. ఎందుకంటే ఆమె లెజండరీ ప్లేయర్’’ అని హర్మోనీ టాన్‌ తెలిపింది. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts