ICC T20 Rankings : షఫాలీ వర్మ ‘టాప్‌’.. పడిపోయిన మంధాన ర్యాంక్‌

ఇంకో మూడు రోజుల్లో 18వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న..

Published : 25 Jan 2022 23:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంకో మూడు రోజుల్లో (జనవరి 28) పద్దెనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న టీమ్ఇండియా మహిళా క్రికెటర్‌ షఫాలీ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. అంతర్జాతీయంగా 28 టీ20లను ఆడిన షఫాలీ 687 పరుగులు చేసింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో 726 పాయింట్లతో షఫాలీ వర్మ తొలి స్థానం దక్కించుకోగా.. బేత్‌ మూనీ (ఆసీస్‌) రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న భారత బ్యాటర్‌ స్మృతీ మంధాన (709) కూడా ఒక ర్యాంక్‌ కిందికి దిగి నాలుగో స్థానంలో నిలిచింది. ఆసీస్‌కు చెందిన మెగ్‌ లానింగ్‌ (714) మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌-10లో భారత్‌ నుంచి ఒకే ఒక క్రికెటర్‌ స్థానం దక్కించుకోగలిగింది. దీప్తి శర్మ (315) నాలుగో ర్యాంకు నుంచి మూడో ర్యాంకుకు చేరింది. ఆస్ట్రేలియాకు చెందిన సోఫీ డివైన్‌ (370), నటాలీ స్కివెర్ (352) తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని