Babar-Rizwan: బాబర్‌-రిజ్వాన్‌ స్వార్థపరులు.. వదిలించుకొనే సమయం ఆసన్నమైంది!

ఏడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్లు అజేయంగా నిలిచి 200 పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేశారు. టీ20 ఫార్మాట్‌ చరిత్రలో...

Published : 24 Sep 2022 02:16 IST

పాకిస్థాన్‌ సూపర్ బౌలర్‌ షహీన్‌ ట్వీట్‌ వైరల్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఏడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్లు అజేయంగా నిలిచి 200 పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేశారు. టీ20 ఫార్మాట్‌ చరిత్రలో రిజ్వాన్ (88*)-బాబర్‌ (110*) రెండో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం నిర్మించిన బ్యాటర్లుగా రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి వికెట్‌కు 203 పరుగులను జోడించి ఇంగ్లాండ్‌పై పది వికెట్ల తేడాతో పాక్‌కు ఘన విజయం సాధించి పెట్టారు. ఈ క్రమంలో పాక్‌ ఓపెనర్లపై షహీన్ షా అఫ్రిది సరదా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఎవరినో టార్గెట్‌ చేసి ట్వీట్‌ చేసినట్లు అనిపిస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 199/5 స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 19.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 203 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సందర్భంగా షహీన్‌ ట్విటర్‌ వేదికగా.. ‘‘కెప్టెన్‌ బాబర్ అజామ్‌, రిజ్వాన్‌ను వదిలించుకోవాల్సిన సమయం వచ్చేసింది. మరీ ఇంత స్వార్థపరులు.. ఇంకా బాగా ఆడి ఉంటే 15 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగించే అవకాశం ఉండేది. కానీ వారిద్దరూ మాత్రం చివరి ఓవర్‌ వరకు తీసుకెళ్లారు. అందుకే  ఓ ఉద్యమం చేయాలి. (కన్ను కొట్టినట్లు ఎమోజీ). పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ను చూస్తే గర్వంగా ఉంది’’ అని ట్వీట్ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని