Shaheen Afridi: దయ చేసి.. ఇలాంటి జ్ఞాపకాలను నాశనం చేయొద్దు: షాహీన్‌

పాకిస్థాన్‌ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది (Shaheen Afridi) మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది (Shahid Afridi) ఇంటికి అల్లుడయ్యాడు. అఫ్రిది కుమార్తెతో షాహీన్‌ వివాహం కరాచీ వేదికగా జరిగింది.  

Published : 05 Feb 2023 14:25 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ పేసర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది (Shahid Afridi) కుమార్తెను షాహీన్‌ శనివారం వివాహం చేసుకొన్నాడు. అయితే తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ కావడంపై షాహీన్ అఫ్రిది అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని ఫొటోలను షాహీన్‌ తన ట్విటర్‌లో షేర్ చేసినప్పటికీ.. మరికొన్ని ఫొటోలు బయటకు రావడంపై విమర్శలు చేశాడు. వ్యక్తిగతమైన ఫొటోలను షేర్ చేయడం తగదని సూచించాడు.

‘నా భార్య, వారి కుటుంబ సభ్యుల ప్రైవసీకి భంగం కలిగింది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికే చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఇలా చేయడం నిరుత్సాహానికి గురి చేస్తోంది. మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయ చేసి మా జీవితంలో గొప్ప రోజు జ్ఞాపకాలను నాశనం చేయొద్దు. అందుకోసం మీ అందరి సహకారం కావాలి’’ అని షాహీన్‌ ట్వీట్ చేశాడు. ఈ జంట గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. కరాచీ వేదికగా షాహీన్‌ వివాహం జరిగింది. షాదాబ్ ఖాన్, బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, సర్ఫరాజ్‌ ఖాన్‌ తదితర క్రికెటర్లు హాజరయ్యారు. అంతకుముందు షాహిద్‌ అఫ్రిది కూడా తన కుమార్తె ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని