IND vs SA: పాక్‌ పేసర్ షహీన్‌ ట్వీట్‌.. భారత్‌తో పోరు నేపథ్యమేనా..!

పాక్‌ మరో పేసర్ షహీన్‌ షా అఫ్రిది చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ అభిమానులు వారికి కావాల్సిన విధంగా అన్వయించుకొంటూ కామెంట్లతో చెలరేగుతున్నారు.

Published : 08 Oct 2022 01:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌కు మరో రెండు వారాల (అక్టోబర్ 23న) సమయమే ఉంది. ఆసియా కప్‌ తర్వాత దాయాదుల పోరును వీక్షించే అవకాశం మరోసారి రానుంది. ఈ క్రమంలో పాక్‌ ఆటగాళ్లు కాస్త మాటల దూకుడు ప్రదర్శిస్తున్నారు. భారత్-పాక్‌ మ్యాచ్‌ జరిగే మెల్‌బోర్న్ స్టేడియం తనకు సొంత మైదానం వంటిదని, అక్కడ తన బౌలింగ్‌ను అడ్డుకోవడం తేలికైన విషయం కాదని ఫాస్ట్‌ బౌలర్‌ హారిస్‌ రవుఫ్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. తాజాగా పాక్‌ మరో పేసర్ షహీన్‌ షా అఫ్రిది చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇంతకీ షహీన్‌ పోస్టు చేసిన ట్వీట్‌ తెలుసుకోండి.. ఓ లొకేషన్‌లో దిగిన ఫొటోను షహీన్‌ షేర్ చేశాడు. అయితే ఇందులో పెద్ద విశేషం ఏముందంటారా..? ఆ ఫొటోకు ఇచ్చిన క్యాప్షనే నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ‘తుపాను ముందు ప్రశాంతత’ అని చిన్న కాప్షన్ ఉంచాడు. ఇక పాక్‌ అభిమానులు వారికి కావాల్సిన విధంగా అన్వయించుకొంటూ కామెంట్లతో చెలరేగుతున్నారు. ఇది దాయాదుల పోరుకు సంబంధించే షహీన్‌ ట్వీట్ చేశాడని కొందరు కామెంట్లు చేశారు. నీ బౌలింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామని మరికొందరు పోస్టులు పెట్టారు. గాయం కారణంగా ఆసియా కప్‌తోపాటు ఇంగ్లాండ్‌తో ఏడు టీ20ల సిరీస్‌కు షహీన్‌ దూరమయ్యాడు. అలాగే శస్త్రచికిత్స కోసం అతడే సొంతంగా ఖర్చులను వెచ్చించాల్సి వచ్చిందని, పీసీబీ నుంచి ఎలాంటి సహకారం అందలేదనే వార్తలు కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని