ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి తన వయసుపై గందరగోళం సృష్టించాడు. తనకిప్పుడు 44 ఏళ్లని అంటున్నాడు. తాను 1975లో జన్మించానని గతంలో ఒకసారి చెప్పాడు. ఆ లెక్కన చూస్తే అతనికిప్పుడు 46 ఏళ్లు అవ్వాలి. ఐసీసీ రికార్డుల ప్రకారమైతే ఇప్పటికీ అతడి వయసు 41..

Published : 02 Mar 2021 01:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి తన వయసుపై గందరగోళం సృష్టించాడు. తనకిప్పుడు 44 ఏళ్లని అంటున్నాడు. తాను 1975లో జన్మించానని గతంలో ఒకసారి చెప్పాడు. ఆ లెక్కన చూస్తే అతనికిప్పుడు 46 ఏళ్లు అవ్వాలి. ఐసీసీ రికార్డుల ప్రకారమైతే ఇప్పటికీ అతడి వయసు 41. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్‌ అందరినీ తికమక పెట్టింది.

‘జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు 44వ వసంతంలోకి అడుగుపెట్టాను! నా కుటుంబం, నా అభిమానులు నాకు అత్యంత ముఖ్యం. ముల్తాన్‌ జట్టుకు ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. ముల్తాన్‌ సుల్తాన్‌ అభిమానుల కోసం మ్యాచులను గెలిపించే ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని అఫ్రిది సోమవారం ట్వీటాడు.

నిజానికి అఫ్రిది జన్మదినంపై అందరికీ అనుమానాలు ఉన్నాయి. అతడు చెప్పేది వాస్తవమో కాదో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఒక్కోలా చెబుతుంటాడు. ఆ మధ్య గౌతమ్‌ గంభీర్‌ సైతం అతడి వయసుపై విమర్శలు గుప్పించాడు. ఐసీసీ రికార్డుల్లో అఫ్రిది జన్మదినం 1980, మార్చి 1గా ఉంటుంది. అంటే అతడి వయసు ఇప్పుడు 41గా ఉండాలి. తన స్వీయ చరిత్రలోనేమో 1975లో పుట్టానని చెప్పాడు. 1996లో 37 బంతుల్లో శతకం చేసినప్పుడు తనకు 19 ఏళ్లని చెప్పాడు. కానీ ఐసీసీ ప్రకారం 16 ఏళ్ల 217 రోజులు. అందుకే అతడి ట్వీట్‌ తికమక పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని