LLC : గంభీర్ హెల్మెట్‌కు తగిలిన బంతి.. క్రీడా స్ఫూర్తిని చాటిన అఫ్రిది..
‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’(Legends League Cricket) మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తిని చాటే ఓ ఆసక్తికర ఘటన నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్ : భారత్, పాక్ దిగ్గజ ఆటగాళ్లైన గౌతం గంభీర్(Gautam Gambhir), షాహిద్ అఫ్రిది(Shahid Afridi).. అవకాశం వస్తే చాలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుంటారు. అలాంటి వీరిద్దరూ.. ఇటీవల ఒక మ్యాచ్‌లో తలపడ్డారు. తమ మధ్య స్నేహ బంధాన్ని చాటుకున్నారు. ఇందుకు ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’(Legends League Cricket) వేదికైంది. శుక్రవారం ‘ఇండియా మహారాజాస్’, ‘ఆసియా లయన్స్’ మధ్య మ్యాచ్ జరిగింది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికకర ఘటన చోటుచేసుకుంది.
‘మహారాజాస్’ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 11వ ఓవర్‌లో గంభీర్ ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. వెంటనే లెగ్ సైడ్ ఫీల్డింగ్ చేస్తున్న అఫ్రిది గంభీర్ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దాయాది దేశాల ఆటగాళ్లైనప్పటికీ.. ఈ క్రీడాస్ఫూర్తిని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో గంభీర్ 54 పరుగులు చేసినప్పటికీ.. మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో 9 పరుగుల తేడాతో ‘మహారాజాస్’ జట్టు ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత