Virat Kohli: విరాట్‌.. నువ్వు GOAT.. క్రికెట్‌ను అందంగా తీర్చిదిద్దావ్: పాక్‌ పేసర్‌

భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీకి పాక్‌ పేసర్‌ షెహ్నవాజ్‌ దహానీ ఒకరోజు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా విరాట్‌ను GOAT అంటూ కొనియాడాడు.

Published : 05 Nov 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ ప్రపంచంలో కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా విరాట్‌ కోహ్లీ గురించే చర్చ. పాకిస్థాన్‌పై వీరోచితంగా పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చిన విరాట్‌.. ఆపై నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌పైనా అర్ధశతకాలు నమోదుచేసి, ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇదిలా ఉండగా.. నవంబర్‌ 5న ‘కింగ్‌’ పుట్టినరోజు చేసుకోబోతున్నాడు. శనివారం 34వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న విరాట్‌కు పాకిస్థాన్‌ పేసర్‌ షెహ్నవాజ్‌ దహానీ ముందుగానే శుభాకాంక్షలు తెలిపాడు. క్రికెట్‌ను అందంగా మార్చిన కోహ్లీని GOAT (Greatest Of All Time) అని కొనియాడాడు.

‘క్రికెట్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దిన వ్యక్తికి శుభాకాంక్షలు తెలిపేందుకు నవంబర్‌ 5 వరకు ఆగలేకపోతున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు విరాట్‌ కోహ్లీ #GOAT. ఈ రోజును ఆస్వాదించు సోదరా. ప్రపంచాన్ని ఇలాగే అలరిస్తూ ఉండు’ అంటూ దహానీ ట్వీట్‌ చేస్తూ, కోహ్లీతో తాను దిగిన ఓ ఫొటోను పంచుకున్నాడు. కాగా ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటికే దీన్ని85వేల మందికి పైగా లైక్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని