Bangladesh Cricket : బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌ సహా టీ20 ప్రపంచకప్‌ పోటీలకు ...

Published : 14 Aug 2022 02:16 IST

ఆసియా కప్‌, పొట్టి ప్రపంచకప్‌నకు కెప్టెన్‌గా షకిబ్

ఇంటర్నెట్ డెస్క్‌: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌ సహా టీ20 ప్రపంచకప్‌ పోటీలకు కెప్టెన్‌గా సీనియర్‌ ప్లేయర్‌ షకిబ్ అల్ హసన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం విశేషం. జింబాబ్వే మీద టీ20 సిరీస్‌ సహా వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ కోల్పోవడంతో భారీ మార్పులు చేసింది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 17మందితో కూడిన జట్టును ఆసియా కప్‌ కోసం బీసీబీ ప్రకటించింది. ఇటీవల షకిబ్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ బెట్టింగ్‌ కంపెనీతో షకిబ్ ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీసీబీ విచారణకు సిద్ధమైంది. అయితే వివాదం నెలకొనడంతో తాను బెట్‌విన్నర్‌ అనే న్యూస్‌తో జట్టు కట్టినట్లు పేర్కొన్నాడు. దీనిపైనా వివాదం కొనసాగడంతో ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్లు షకిబ్‌ ప్రకటించాడు. అంతకుముందు భారత్‌కు చెందిన బుకీతో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో షకిబ్‌పై ఏడాదిపాటు ఐసీసీ నిషేధం విధించింది.  

వచ్చే ఆసియా కప్‌లో మాత్రమే కాకుండా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ మధ్య ట్రైసిరీస్‌లోనూ టీమ్‌కు సారథిగా షకిబ్‌ వ్యవహరిస్తాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించకపోయినా సారథిగా మాత్రం షకిబ్‌ ఉంటాడని బీసీబీ వెల్లడించింది. ఆసియా కప్‌లో ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌, పాకిస్థాన్‌ తమ జట్లను ప్రకటించాయి.

ఆసియా కప్‌నకు బంగ్లాదేశ్‌ టీమ్‌: షకిబ్ అల్ హసన్‌ (కెప్టెన్), అనముల్‌ హక్, ముష్ఫికర్‌ రహిమ్‌, అఫిఫ్‌ హోస్సెన్, మొసడక్‌ హోస్సెన్, మహముదుల్లా, మహేది హసన్, సైఫుద్దిన్, హసన్‌ మహ్‌ముద్‌, ముస్తాఫిజర్‌ రహ్మాన్, నాసుమ్ అహ్మద్, సబ్బిర్ రహ్మాన్‌, మెహిదీ హసన్‌ మిరాజ్‌, ఎబాడట్‌ హోస్సెన్, పర్వేజ్‌ హోస్సెన్‌ ఎమన్‌, నురుల్‌ హసన్‌ సోహన్‌, టాస్కిన్‌ అహ్మద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు